

కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం తిరువణ్ణామలైలోని అన్నామలయ్యార్ ఆలయాన్ని సందర్శించనున్న నేపథ్యంలో అక్కడ భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆలయం పరిసరాల్లో మూడు అంచెల భద్రతను ఏర్పాటు చేసి సుమారు 1,500 మంది పోలీసులను మోహరించినట్లు సమాచారం. అమిత్ షా పర్యటన నేపథ్యంలో ఆలయంలో భద్రతా తనిఖీలను మరింత కట్టుదిట్టం చేశారు.
ఈ క్రమంలో హైదరాబాద్‌కు చెందిన పౌనిష్, మహేశ్ అనే ఇద్దరు వ్యక్తులు కెమెరా అమర్చిన కళ్లద్దాలతో ఆలయంలోని అన్నామలయ్యార్, ఉన్నాములై అమ్మవారి విగ్రహాలను చిత్రీకరించేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న ఆలయ అధికారులు వెంటనే వారిని పరిపాలనా కార్యాలయానికి తీసుకెళ్లి, కెమెరా ఉన్న కళ్లద్దాలతో పాటు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఇద్దరినీ పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం పోలీసులు వారిని విచారిస్తున్నారు. హోంమంత్రి పర్యటన కోసం భారీ భద్రతా ఏర్పాట్లు చేసిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!