

నాగచైతన్య, దర్శకుడు కార్తీక్ దండు కలయికలో తెరకెక్కుతున్న మిస్టిక్ హారర్ థ్రిల్లర్ ‘వృషకర్మ’పై ఆసక్తి నెలకొంది. బీవీఎస్‌ఎన్ ప్రసాద్, సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తున్నారు. స్పర్ష్ శ్రీవాస్తవ, జయరామ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ ముగింపు దశకు చేరుకున్న ఈ చిత్రం డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
పురాణాంశాలను మిళితం చేస్తూ తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగచైతన్య నిధి అన్వేషకుడిగా విభిన్న పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం సినిమా విడుదల తేదీపై చిత్రబృందం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారికంగా విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంపై నాగచైతన్య అభిమానుల్లోనూ ఆసక్తి నెలకొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!