
జనరల్

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ, పాకిస్థానీ జర్నలిస్ట్ వజహత్ సయీద్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రావల్పిండిలోని అడియాలా జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ అక్కడే మరణించి ఉండవచ్చని ముగ్గురు సీనియర్ సైనిక వర్గాలు తనకు తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు. అయితే ఈ వాదనలకు స్వతంత్ర ధ్రువీకరణ లభించలేదు.
ఇదిలా ఉండగా, ఇమ్రాన్ ఖాన్‌ను కలిసేందుకు తమకు అనుమతి ఇవ్వడం లేదని ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత ఇవ్వాలని వారు కోరుతున్నారు. జర్నలిస్ట్ చేసిన తాజా వ్యాఖ్యలతో ఇమ్రాన్ ఖాన్ పరిస్థితిపై నెలకొన్న అనుమానాలు మరింత పెరిగాయి. అయితే ఆయన మృతిపై అధికారిక ధ్రువీకరణ ఇప్పటివరకు వెలువడలేదు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!