
ఓటీటీ

పీఎంజే జ్యువెల్లరీ దోపిడీ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడిని పశ్చిమ బెంగాల్ నుంచి పట్టుకుని నిన్న అర్ధరాత్రి కరీంనగర్‌కు తీసుకువచ్చినట్లు సమాచారం. మిగతా నిందితుల ఆచూకీ కోసం పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
కరీంనగర్ నుంచి ధర్మపురి మీదుగా పారిపోతున్న సమయంలో మద్దూరు వద్ద దుండగులు వాడిన మొబైల్ ఫోన్‌ను పగులగొట్టారు. అయితే స్థానిక యువకులు ఆ ఫోన్‌ను గుర్తించి పోలీసులకు అప్పగించగా, అందులో కీలక ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. దోపిడీ బంగారం కొనుగోలు చేసిన వ్యాపారినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొంత సొత్తు రికవరీ కాగా, మిగతా ముగ్గురు నిందితుల కోసం ఐదు రాష్ట్రాల్లో ముమ్మర గాలింపు కొనసాగుతోంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!