

రూ.3,000 కోట్ల ఆదాయ లక్ష్యంతో హెచ్‌ఎండీఏ మరోసారి భారీ భూ వేలానికి సిద్ధమవుతోంది. కోకాపేట్‌లోని నియోపొలిస్, గోల్డెన్‌మైల్ లేఅవుట్‌లలో ఉన్న విలువైన భూములపై ఈసారి ప్రధానంగా దృష్టి సారించనుంది. అలాగే మోకిలా సహా ఇతర ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములకు సెప్టెంబర్‌లో ఆన్‌లైన్ బిడ్డింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. కోకాపేట్ సహా పలు ప్రాంతాల్లో హెచ్‌ఎండీఏ గతంలో నిర్వహించిన ఈ-వేలాలకు భారీ స్పందన లభించింది.
భూ వేలం ద్వారా సమీకరించే నిధులను హైదరాబాద్‌లోని కీలక మౌలిక వసతుల అభివృద్ధికి వినియోగించనున్నారు. ముఖ్యంగా ఎలివేటెడ్ కారిడార్లు, రేడియల్ రోడ్ల నిర్మాణం, మెట్రో విస్తరణకు అవసరమైన భూసేకరణ వంటి ప్రాజెక్టులకు నిధులు సమకూర్చేలా ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం. వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ నగరంలో రవాణా, కనెక్టివిటీని మరింత మెరుగుపరిచేందుకు ఈ వేలం ద్వారా వచ్చే ఆదాయం కీలకంగా మారనుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!