

కేవలం 15 ఏళ్ల వయసులోనే వైభవ్ సూర్యవంశీ బ్రాండ్ వాల్యూ భారీగా పెరిగింది. IPL 2026లో సంచలన ప్రదర్శనతో అతడు క్రికెట్‌లోనే కాకుండా కమర్షియల్ మార్కెట్‌లోనూ హాట్ టాపిక్‌గా మారాడు. ఐపీఎల్‌కు ముందు ఒక్కో ఎండార్స్‌మెంట్ డీల్‌కు సుమారు రూ.1 కోటి తీసుకున్న వైభవ్.. ప్రస్తుతం ఒక్కో బ్రాండ్ డీల్‌కు రూ.1.5 కోట్ల నుంచి రూ.2 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. దీంతో అతడితో ఒప్పందాలు చేసుకునేందుకు పలు ప్రముఖ బ్రాండ్లు ఆసక్తి చూపుతున్నాయి.
ఇప్పటికే కాంప్లాన్, రెడ్ బుల్ వంటి ప్రముఖ బ్రాండ్లతో వైభవ్‌కు అనుబంధం ఉంది. అంతేకాకుండా మరిన్ని కంపెనీలు అతడితో ఒప్పందాల కోసం పోటీ పడుతున్నాయి. బ్యాట్ స్పాన్సర్‌షిప్‌కు సంబంధించి ఏడాదికి రూ.12 కోట్ల విలువైన డీల్ ఖరారు దశలో ఉందని కూడా నివేదికలు పేర్కొన్నాయి. IPL 2026లో అత్యధిక పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్‌తో పాటు MVP అవార్డును గెలుచుకోవడం వైభవ్ మార్కెట్ విలువ పెరగడానికి ప్రధాన కారణంగా నిలిచింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!