
జనరల్

ప్రధాని నరేంద్ర మోదీ దౌత్యపరమైన పాత్రపై పోలాండ్ మంత్రి బార్టోజెవ్‌స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సందర్భంగా 2022లో మోదీ చేపట్టిన దౌత్య ప్రయత్నాలు అత్యంత కీలకంగా నిలిచాయని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా ఉక్రెయిన్‌పై రష్యా అణ్వాయుధాల వినియోగం జరగకుండా నిరోధించడంలో మోదీ జోక్యం ప్రభావవంతంగా పనిచేసిందని ప్రశంసించారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రధాని మోదీ అభిప్రాయాలను గౌరవిస్తారని బార్టోజెవ్‌స్కీ అన్నారు. ప్రపంచ వేదికపై భారత్ దౌత్య ప్రభావం మరింత బలపడిందని ఆయన అభిప్రాయపడ్డారు. పోలాండ్ మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!