
క్రీడలు

జూబ్లీహిల్స్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారిపై జరిగిన హత్యాయత్నం కేసులో మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్‌డీ నార్ల సుమంత్‌తో పాటు అతడి అనుచరుల కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. గత నెల 30న డబ్బు విషయమై మాట్లాడేందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారి గొంగిడి హరికృష్ణను పిలిపించి, ఇనుప రాడ్‌తో దాడి చేసినట్లు కేసు నమోదైంది. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.
పరారీలో ఉన్న సుమంత్‌ను పట్టుకునేందుకు పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. ఈ కేసులో సుమంత్ డ్రైవర్ నవీన్‌ను ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారిస్తూ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలను పోలీసులు సేకరిస్తున్నట్లు సమాచారం.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!