
జనరల్

హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ ప్రాంతంలో చెట్ల నరికివేతకు సంబంధించిన అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పార్క్ ప్రాంతంలో తెలంగాణ ప్రభుత్వం చెట్లను నరికివేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ అంశానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌పై కౌంటర్ దాఖలు చేసేందుకు పిటిషనర్ తరఫు న్యాయవాది గడువు కోరారు.
పిటిషనర్ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు తదుపరి విచారణను వచ్చే నెల 7వ తేదీకి వాయిదా వేసింది. కేబీఆర్ పార్క్ ప్రాంతంలోని పచ్చదనం, చెట్ల పరిరక్షణకు సంబంధించిన అంశంపై కోర్టు విచారణ కొనసాగనుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!