

కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఆధిపత్యం కొనసాగిస్తోంది. రెండో రోజు ఆటలో వర్షం అంతరాయం కలిగించడంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు. మైదానాన్ని సిబ్బంది కవర్లతో కప్పారు. వర్షం కారణంగా టీ బ్రేక్‌ను ముందుగానే ప్రకటించే సమయానికి భారత్ 131.2 ఓవర్లలో 475/8తో ఉంది. ధ్రువ్ జురెల్ 95 పరుగులతో సెంచరీకి చేరువగా ఉండగా.. మహ్మద్ సిరాజ్ అతడికి తోడుగా క్రీజ్‌లో ఉన్నాడు. అంతకుముందు మానవ్ సుతార్ 18 పరుగులకు ఔటవ్వడంతో ప్రభాత్ జయసూర్యకు వికెట్ దక్కింది.
ఈ ఇన్నింగ్స్‌లో రిషభ్ పంత్ కూడా కీలక పాత్ర పోషించాడు. తొలి రోజు గాయంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన పంత్ రెండో రోజు తిరిగి బ్యాటింగ్‌కు వచ్చి 63 పరుగులు చేశాడు. ఈ క్రమంలో తన కెరీర్‌లో 21వ టెస్టు అర్ధశతకాన్ని నమోదు చేశాడు. అలాగే విదేశీ గడ్డపై టెస్టుల్లో 2,500 పరుగుల మైలురాయిని దాటి ఎంఎస్ ధోనీ 2,496 పరుగుల రికార్డును అధిగమించాడు. అనంతరం పంత్ ఔటైనా.. ధ్రువ్ జురెల్ కీలక ఇన్నింగ్స్‌తో భారత్‌ను భారీ స్కోరు దిశగా నడిపిస్తున్నాడు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!