
జనరల్

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ పేరుతో సామాజిక మాధ్యమాలు, వాట్సాప్‌లో వైరల్ అవుతున్న వార్తలు పూర్తిగా నకిలీవని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా స్పష్టం చేశారు. ఎన్నికల తేదీలు, షెడ్యూల్‌కు సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటనను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేయలేదని తెలిపారు. ఎన్నికల సంఘం అనుమతి లేకుండా దాని పేరు, లోగోను ఉపయోగించి ప్రచారం చేయడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు.
ఎన్నికల షెడ్యూల్ పేరుతో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని ఎస్‌ఈసీ సూచించింది. అధికారిక సమాచారం కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి వెలువడే ప్రకటనలను మాత్రమే విశ్వసించాలని కోరింది. నకిలీ సమాచారాన్ని ఇతరులకు పంపడం, సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడం చేయొద్దని అనిల్‌చంద్ర పునేఠా ప్రజలకు సూచించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!