

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం, పార్టీ కార్యకలాపాలను సోషల్ మీడియా ద్వారా మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టి సారించినట్లు సమాచారం. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో మంత్రుల సోషల్ మీడియా కార్యకలాపాలపై ఆయన ఫీడ్‌బ్యాక్ తీసుకున్నట్లు తెలుస్తోంది. నారా లోకేశ్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వంగలపూడి అనిత, ఫరూక్, కొండపల్లి శ్రీనివాస్ తదితరులు తమ కార్యక్రమాలు, నిర్ణయాలు, ప్రజలతో మమేకమవుతున్న తీరును సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారని చర్చించినట్లు సమాచారం.
అయితే ప్రస్తుత స్థాయి కార్యకలాపాలు సరిపోవని చంద్రబాబు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, ఎక్స్ వంటి అన్ని డిజిటల్ వేదికలను విస్తృతంగా వినియోగించి యువతకు చేరువ కావాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు సూచించినట్లు సమాచారం. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ప్రారంభించిన ‘జగన్ 2.0’ యాప్ కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రజలతో మరింత చురుగ్గా మమేకమై, వచ్చే రెండేళ్లలో యువతతో అనుసంధానం పెంచుకోవాలని చంద్రబాబు సూచించినట్లు సమాచారం. ప్రధాన మీడియాపైనా సమానంగా దృష్టి పెట్టాలని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!