
జనరల్

హైదరాబాద్‌లో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న అనధికార నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎంసీ కమిషనర్ శ్రీజన అధికారులను ఆదేశించారు. అనుమతులు లేకుండా నిర్మిస్తున్న భవనాలను గుర్తించి నిబంధనల ప్రకారం కూల్చివేత చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. నిర్మాణాలపై క్షేత్రస్థాయిలో పర్యవేక్షణను మరింత పెంచాలని అధికారులకు సూచించారు.
75 చదరపు గజాలలోపు స్థలంలో నిర్మిస్తున్న భవనం ఎత్తు 7 మీటర్లకు మించితే నిబంధనల ప్రకారం కూల్చివేత చర్యలు చేపట్టాలని కమిషనర్ ఆదేశించారు. భవన నిర్మాణ అనుమతులు, నిబంధనలను ఉల్లంఘించే వారిపై ఎలాంటి ఉపేక్ష ఉండదని స్పష్టం చేశారు. అక్రమ నిర్మాణాలను ప్రారంభ దశలోనే గుర్తించి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!