

పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని 2027 జూన్ నాటికి పూర్తి చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా జాతికి అంకితం చేస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఐదేళ్ల జగన్ పాలనలో ప్రాజెక్ట్ పనులు నిలిచిపోయి ప్రశ్నార్థకంగా మారాయని ఆయన విమర్శించారు. గతంలో పూర్తయ్యే పరిస్థితి లేదని భావించిన ప్రాజెక్టును ఇప్పుడు గర్వంగా పూర్తిచేసే స్థాయికి తీసుకువచ్చామని చెప్పారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో జరిగిన సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. భూసేకరణ, పునరావాసానికి వెంటనే నిధులు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. పోలవరం–నల్లమలసాగర్ ప్రాజెక్టుకు అనుమతులు కోరినట్లు, తెలంగాణతో ఉన్న సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని వివరించారు. చిన్న నీటిపారుదల రంగానికి నిధులు, పైప్‌లైన్ ద్వారా నీటి సరఫరా ప్రాజెక్టులపై కూడా కేంద్ర మంత్రితో చర్చించినట్లు తెలిపారు. కేంద్ర మంత్రి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!