
జనరల్

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. పీఎంకే (PMK) పార్టీ అధ్యక్షుడు అన్బుమణి రామదాస్, పార్టీ వ్యవస్థాపకుడు తన తండ్రి ఎస్. రామదాస్‌ను విల్లుపురం జిల్లా తిండివనం సమీపంలోని తైలపురంలో కలిశారు. తమ తల్లిదండ్రుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపేందుకే వచ్చినట్లు ఆయన తెలిపారు.
2024 డిసెంబర్ నుంచి తండ్రి-కొడుకు మధ్య కొనసాగుతున్న నాయకత్వ వివాదం కారణంగా పార్టీలో చీలిక ఏర్పడింది. ఇటీవల ఎన్నికల్లో రెండు వర్గాలుగా పీఎంకే పోటీ చేసింది. అన్బుమణి వర్గం ఎన్డీఏ కూటమిలో భాగంగా నాలుగు స్థానాలను గెలుచుకోగా, మరో వర్గం వీ.కే. శశికళ నేతృత్వంలోని కూటమితో కలిసి పోటీ చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!