

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన హారర్ కామెడీ చిత్రం ‘కొరియన్ కనకరాజు’ బాక్సాఫీస్ వద్ద మంచి జోరు కొనసాగిస్తోంది. తొలి వీకెండ్‌లోనే ఈ సినిమా బ్రేక్‌ఈవెన్ మార్క్‌ను దాటేసి లాభాల జోన్‌లోకి ప్రవేశించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.37.4 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు చిత్రబృందం వెల్లడించింది. పెయిడ్ ప్రీమియర్స్ నుంచే ప్రేక్షకుల స్పందన సానుకూలంగా ఉండగా.. రోజురోజుకూ సినిమాకు ఆదరణ పెరుగుతోంది. అమెరికా మార్కెట్‌లోనూ ఈ చిత్రం హాఫ్ మిలియన్ డాలర్ల మార్క్‌కు చేరువవుతోంది.

సినిమాలోని కామెడీకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా వరుణ్ తేజ్, సత్య కాంబినేషన్ సన్నివేశాలు వినోదాన్ని పంచుతున్నాయి. మెర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించాయి. తెలంగాణలో సోమవారం బోనాల సెలవు ఉండటంతో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఆశాజనకంగా ఉన్నాయి. దీంతో రాబోయే రోజుల్లో వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే పెట్టుబడిని రికవర్ చేసిన ఈ చిత్రం.. ఇకపై ఎంతటి లాభాలను అందుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!