

హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో మెడికో విద్యార్థిని ప్రియాంక మృతదేహానికి పోస్టుమార్టం పూర్తైంది. అనంతరం ఆమె భౌతికకాయాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. మృతదేహాన్ని గద్వాల జిల్లా ఐజ మండలం ఏక్లాస్‌పురం గ్రామానికి తరలించారు. అక్కడ సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. గాంధీ ఆస్పత్రి మార్చురీలో ప్రియాంక భౌతికకాయానికి మంత్రి వాకిటి శ్రీహరి, మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, రాజమండ్రి ఎమ్మెల్యే శ్రీనివాస్ నివాళులు అర్పించారు. ప్రియాంక తండ్రిని ఓదార్చి ధైర్యం చెప్పారు.
ప్రియాంక మృతి అత్యంత దురదృష్టకరమని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఆమె మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి కుటుంబ సభ్యులు, అధికారులకు అవసరమైన ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. చట్టాల్లోని లొసుగులను ఆసరాగా చేసుకుని నిందితులు తప్పించుకోకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రియాంక కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!