
క్రీడలు

చంద్రబాబు నాయుడు తన నివాసానికి విచ్చేసిన ప్రధాని నరేంద్ర మోదీ తో జరిగిన సమావేశంపై ఆనందం వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా స్పందించిన చంద్రబాబు, ఈ సాయంత్రం తమ కుటుంబానికి ఎప్పటికీ మర్చిపోలేని మధుర జ్ఞాపకంగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. ప్రధానికి ఆతిథ్యం ఇవ్వడం గొప్ప గౌరవంగా భావిస్తున్నామని, ఆయనతో ఆప్యాయంగా గడిపిన క్షణాలు ఎంతో ప్రత్యేకమని తెలిపారు.
తమ ఆహ్వానాన్ని మన్నించి నివాసానికి విచ్చేసినందుకు ప్రధాని మోదీకి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రయాణంలో కేంద్రం అందిస్తున్న నిరంతర ప్రోత్సాహం, మద్దతుకు కూడా ధన్యవాదాలు తెలిపారు. ఈ భేటీ రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో విశేష చర్చకు దారితీసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!