

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు బుధవారం ముంబైలో మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజేశ్ అగర్వాల్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, రాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ధి ప్రగతి, రైజింగ్ తెలంగాణ–2047 విజన్ లక్ష్యాలను వివరించారు. తెలంగాణ–మహారాష్ట్ర మధ్య ఉన్న సత్సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడం, పరస్పర సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లే అంశాలపై ఇరువురు చర్చించారు.
అనంతరం సంజయ్ జాజు ముంబైలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సీఎండీ సి.ఎస్. శెట్టిని కలిశారు. తెలంగాణలోని అభివృద్ధి అవకాశాలు, పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, రైజింగ్ తెలంగాణ–2047 లక్ష్యాలను ఆయన వివరించారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, పారిశ్రామిక ప్రగతి, పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఎస్‌బీఐ సీఎండీకి వివరించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!