
జనరల్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రేపు హన్మకొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా హనుమాన్ నగర్, పేడపల్లి ప్రాంతాల్లో ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ పర్యటనలో భాగంగా స్థానిక ప్రజలతో కూడా ఆయన మమేకం కానున్నారు.
ఈ పర్యటనలో అత్యంత భావోద్వేగ క్షణంగా నిలిచే అంశం 17 ఏళ్ల దివ్యాంగుడు పొనుగోటి నిరంజన్‌ను పవన్ కళ్యాణ్ కలవనుండటం. ఏడేళ్ల వయసు నుంచే మంచానికే పరిమితమైన నిరంజన్‌కు తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్‌ను ఒక్కసారైనా కలవాలన్న కోరిక చాలా కాలంగా ఉంది. అతని ఆకాంక్షను తెలుసుకున్న పవన్ కళ్యాణ్ స్వయంగా అతని ఇంటికి వెళ్లి పరామర్శించనుండటంతో కుటుంబ సభ్యులు, అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!