

ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన సందర్భాన్ని రాఘవ్ చద్దా ఎంతో ప్రత్యేకంగా అభివర్ణించారు. ఈ ఉదయం తన జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే క్షణమని పేర్కొంటూ, ప్రధాని ఇచ్చిన సమయం, జరిగిన సుదీర్ఘ చర్చ, మార్గదర్శకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఆప్ నుంచి బీజేపీలో చేరిన తర్వాత ఆయన రాజకీయ ప్రయాణంలో ఇది కీలక మలుపుగా భావిస్తున్నారు.
ఈ భేటీ కేవలం మర్యాదపూర్వకమైనదేనా లేదా బీజేపీలో చద్దాకు మరింత కీలక బాధ్యతలు రానున్నాయా అనే చర్చ రాజకీయ వర్గాల్లో కొనసాగుతోంది. ఒకప్పుడు కేంద్రంపై విమర్శలు చేసిన చద్దా, ఇప్పుడు ప్రభుత్వ విధానాలకు మద్దతుగా నిలుస్తున్నారు. ముఖ్యంగా పరీక్షలలో అక్రమాలు, పేపర్ లీక్‌లపై కఠిన చర్యలకు ఆయన మద్దతు తెలిపారు. ఇదే సమయంలో ఐఐటీ ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ యువత శక్తిపై విశ్వాసం వ్యక్తం చేస్తూ, అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణంలో వారి పాత్ర కీలకమని చెప్పారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!