
జనరల్

మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా మహారాజ్‌గూడ గ్రామంలో ఉన్న ఓ ఇల్లు ప్రత్యేకతను సంతరించుకుంది. తెలంగాణ–మహారాష్ట్ర రాష్ట్ర సరిహద్దు ఈ ఇంటి మీదుగా వెళ్లడంతో ఇంట్లోని నాలుగు గదులు తెలంగాణ పరిధిలో, మరో నాలుగు గదులు మహారాష్ట్ర పరిధిలో ఉన్నాయి. దీంతో ఒకే ఇంట్లో రెండు రాష్ట్రాల సరిహద్దు ఉండటం ఆసక్తికరంగా మారింది.
ఈ ఇంటి నిర్మాణంలోనూ మరో ప్రత్యేకత ఉంది. ఇంట్లోని కిచెన్ తెలంగాణ వైపు ఉండగా.. హాల్, బెడ్‌రూమ్‌లు మహారాష్ట్ర వైపు ఉన్నాయి. అంతేకాదు, ఇంటి యజమాని రెండు రాష్ట్రాలకూ ఆస్తి పన్ను చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర సరిహద్దుల్లోని గ్రామాల్లో ఏర్పడే ప్రత్యేక పరిస్థితులకు ఈ ఇల్లు ఒక ఆసక్తికర ఉదాహరణగా నిలుస్తోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!