
సినిమాలు

దిల్లీ హైకోర్టులో వర్చువల్ విచారణ జరుగుతున్న సమయంలో అశ్లీల వీడియోలు ఒక్కసారిగా ప్లే కావడంతో కలకలం రేగింది. చీఫ్ జస్టిస్ బెంచ్ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కేసును విచారిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విచారణను పునఃప్రారంభించినప్పటికీ పలుమార్లు ఇదే విధంగా వీడియోలు కనిపించడంతో అధికారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. చివరకు ‘మీరు హ్యాక్ అయ్యారు’ అనే సందేశం ప్రత్యక్షమవడంతో విచారణను పూర్తిగా నిలిపివేశారు.
ఈ ఘటన వెనుక సైబర్ దాడి జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు వర్చువల్ విచారణలోకి చొరబడి అశ్లీల కంటెంట్ ప్లే చేసినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. ‘శ్రీధర్ సర్నోబత్’, ‘షిత్‌జీత్ సింగ్’ పేర్లతో ఉన్న రెండు ఖాతాల నుంచి ఈ వీడియోలు ప్లే అయినట్లు అధికారులు గుర్తించారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!