

తుంగభద్ర జలాశయంలో పేరుకుపోయిన పూడికను తొలగించేందుకు అనుసరించాల్సిన మార్గాలు, ఖర్చు, విధివిధానాలను రూపొందించేందుకు తుంగభద్ర హైలెవల్ కమిటీ ఉపకమిటీని ఏర్పాటు చేసింది. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న పూడికతీత విధానాలను అధ్యయనం చేసి, సమగ్ర నివేదిక అందించాలని ఉపకమిటీకి సూచించింది. తుంగభద్ర డ్యాం, పరీవాహక ప్రాంత సమస్యల పరిష్కారంపై చర్చించేందుకు కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ తొలి సమావేశం దిల్లీలో జరిగింది.
సమావేశంలో జలాశయంలో తగ్గుతున్న నీటి నిల్వ సామర్థ్యం, సాగు, తాగునీటి అవసరాలు, జలవిద్యుత్ ఉత్పత్తిపై ప్రభావం, నావలి రిజర్వాయర్ నిర్మాణం, ఆర్డీఎస్ సమస్యలపై చర్చించారు. తెలంగాణ తరఫున రాజోలి బండ డైవర్షన్ స్కీం ఆధునికీకరణ పనులను చేపట్టాలని విజ్ఞప్తి చేయగా, ఏపీ నావలి రిజర్వాయర్‌ను బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా అభివృద్ధి చేసి అదనంగా 15 టీఎంసీల నీటిని కేటాయించాలని ప్రతిపాదించింది. 15 రోజుల్లో మరోసారి సమావేశం నిర్వహించాలని కమిటీ నిర్ణయించింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!