

తెలంగాణ వ్యాప్తంగా నేడు, రేపు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి, ములుగు, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం బలపడిందని వాతావరణ నిపుణులు తెలిపారు. ఇది బెంగాల్లోని హల్దియా సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, బాపట్ల, శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ పేర్కొంది. తీర ప్రాంతాల్లో అప్రమత్తతగా ఉండాలని సూచిస్తూ పలు ఓడరేవుల్లో హెచ్చరికలు జారీ చేశారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!