
జనరల్

తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్‌పీడీసీఎల్) చరిత్రలోనే అత్యధిక విద్యుత్ డిమాండ్ నమోదైంది. మంగళవారం మధ్యాహ్నం 3.52 గంటలకు 12,044 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. దీంతో సంస్థ చరిత్రలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక డిమాండ్‌గా ఇది నిలిచింది.
గతేడాది సెప్టెంబర్ 11న 11,828 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది. తాజాగా 12,044 మెగావాట్లకు డిమాండ్ చేరడంతో గత రికార్డు అధిగమించింది. విద్యుత్ వినియోగం పెరగడంతో డిమాండ్ గణనీయంగా పెరిగినట్లు అధికారులు తెలిపారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!