

హైదరాబాద్‌లోని నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) మూడేళ్లలోపు 1,000 రోబోటిక్ సర్జరీలు విజయవంతంగా పూర్తి చేసి అరుదైన రికార్డు సృష్టించింది. ఈ శస్త్రచికిత్సల్లో 90 శాతానికి పైగా ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) పథకాల ద్వారా ఉచితంగా నిర్వహించడం విశేషం. అత్యాధునిక వైద్య సేవలను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంలో నిమ్స్ మరో మైలురాయిని చేరుకుంది.
తొమ్మిది నెలల పసిపాప నుంచి 83 ఏళ్ల వృద్ధుల వరకు రోబోటిక్ శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించిన నిమ్స్‌లో యూరాలజీ విభాగంలో అత్యధికంగా 590 సర్జరీలు జరిగాయి. అనంతరం సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీలో 248, సర్జికల్ ఆంకాలజీలో 162 సర్జరీలు పూర్తయ్యాయి. ఈ ఘనతతో నిమ్స్ ఢిల్లీ ఎయిమ్స్, బెంగళూరులోని కిద్వాయ్ ఆసుపత్రులతో పాటు దేశంలోని అగ్రగామి ప్రభుత్వ ఆసుపత్రుల సరసన నిలిచి, తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగవంతమైన కోలుకునే చికిత్సను అందిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!