
ఓటీటీ

ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా ఢిల్లీ పోలీస్ కమిషనర్ కొత్త మార్గదర్శకాలను జారీ చేశారు. ప్రభుత్వ వాహనాల వినియోగంపై కఠిన నిబంధనలు అమలు చేస్తూ, పోలీస్ శాఖలో కార్ పూలింగ్ను తప్పనిసరి చేశారు. ఒకే కార్యాలయానికి వెళ్లే అధికారులు ఒకే వాహనాన్ని ఉపయోగించాలని సూచించారు. అలాగే వీఐపీ కాన్వాయ్‌లలో వాహనాల సంఖ్యను తగ్గించాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
అధికారుల రాకపోకలను తగ్గించేందుకు వీలైనంత వరకు వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారానే సమావేశాలు నిర్వహించాలని సూచించారు. మెట్రో, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వినియోగాన్ని ప్రోత్సహిస్తూ, ఇంధన వినియోగాన్ని తగ్గించే చర్యలు చేపట్టాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!