
క్రీడలు

కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుని 17 ఏళ్ల విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. హుబ్బళి నుంచి లక్ష్మేశ్వర్కు వెళ్తున్న బస్సులో ప్రయాణిస్తున్న ఫక్కీరేష్ కుందగోళ్ వద్ద కిటికీలోంచి తల బయటకు పెట్టాడు. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన టిప్పర్ అతడిని బలంగా ఢీకొట్టడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. అతను అక్కడికక్కడే మృతి చెందాడు.
ఈ ఘటనతో బస్సులో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. మృతుడు ఐటీఐ విద్యార్థిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కదులుతున్న వాహనాల్లో కిటికీల వద్ద జాగ్రత్తలు పాటించకపోతే చిన్న నిర్లక్ష్యమే ప్రాణాంతకంగా మారుతుందని అధికారులు హెచ్చరించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!