
సినిమాలు

విజయవాడలో టీడీపీ-వైసీపీ మధ్య కొనసాగుతున్న వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుపై పోలీసులు కేసు నమోదు చేశారు. డీఎస్సీ అక్రమాలపై ఈ నెల 8న మల్లాది విష్ణు ఆధ్వర్యంలో వైసీపీ రిలే దీక్ష చేపట్టింది. ఈ దీక్షా శిబిరం వద్దకు టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా రావడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగినట్లు సమాచారం.
ఈ ఘటనపై ఇరువర్గాలు పోలీసులకు ఫిర్యాదులు చేసుకున్నాయి. షేక్ పర్వీన్ అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మల్లాది విష్ణుపై కేసు నమోదైంది. రోడ్డుపై ధర్నా ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించినందుకు తనపై దాడి చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. తనపై దాడి చేయడంతో పాటు అసభ్యంగా ప్రవర్తించారని కూడా ఆమె ఆరోపించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!