
జనరల్

మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు కాకరాల సమత అలియాస్ మాధవి ములుగు జిల్లాలో తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. దీంతో మావోయిస్టు ఉద్యమంలో ఆమె 41 ఏళ్ల ప్రస్థానానికి ముగింపు పలికినట్లైంది. సమత 1985లో పీపుల్స్‌వార్‌లో చేరారని, 2003లో రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా ఎదిగారని పోలీసులు తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వ లొంగుబాటు పునరావాస విధానంలో భాగంగా సమతకు రూ.20 లక్షల రివార్డుతో పాటు రూ.25 వేల తాత్కాలిక ఆర్థిక సాయం అందించారు. పునరావాసం, ఉపాధి అవకాశాలు, వృత్తి శిక్షణ వంటి సహాయాన్ని కూడా అందిస్తామని అధికారులు తెలిపారు. మిగిలిన యాక్టివ్ మావోయిస్టు కేడర్లు కూడా సాయుధ పోరాటాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలవాలని డీజీపీ సి.వి. ఆనంద్ పిలుపునిచ్చారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!