
సినిమాలు

ఒంగోలులో వరుసగా చోటుచేసుకుంటున్న వివాదాలపై డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరా తీసినట్లు తెలుస్తోంది. జనసేన నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్రావుకు సంబంధించిన పరిణామాలపై జనసేన అధిష్టానం దృష్టి సారించింది. ఒంగోలులో పార్టీ శ్రేణులు ఎదుర్కొంటున్న సమస్యలను సుమారు 15 రోజుల క్రితమే బాలినేని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.
ఈ సమస్యలపై మీడియా సమావేశం నిర్వహిస్తామని బాలినేని ప్రకటించగా, సమావేశం నిర్వహించవద్దని జనసేన అధిష్టానం సూచించినట్లు తెలుస్తోంది. సమస్యలన్నింటినీ త్వరలోనే పరిష్కరిస్తామని బాలినేనికి పార్టీ అధిష్టానం హామీ ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఒంగోలు రాజకీయ పరిణామాలను జనసేన నాయకత్వం నిశితంగా పరిశీలిస్తోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!