
జనరల్

కావేరి జలాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కన్నడ సంఘాలు నేడు కర్ణాటక బంద్‌కు పిలుపునిచ్చాయి. బంద్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు జరిగే అవకాశం ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కీలక ప్రాంతాల్లో భద్రతను పెంచారు.
బంద్ ప్రభావంతో ప్రజా రవాణా, వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రధాన నగరాలు, రద్దీ ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. బంద్ నేపథ్యంలో సాధారణ జనజీవనానికి అంతరాయం కలగకుండా పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!