
జనరల్

నారా లోకేష్ కైలాసగిరిపై నూతనంగా ఏర్పాటు చేసిన 65 అడుగుల డమరుకం కలిగిన భారీ త్రిశూలంపై సోషల్ మీడియాలో ప్రత్యేక ట్వీట్ చేశారు. ఈ త్రిశూలం ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక, సాంస్కృతిక పునరుజ్జీవనానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. గుజరాత్లోని పవిత్ర సోమనాథ్ ఆలయం చారిత్రాత్మక పునర్నిర్మాణానికి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ ఆవిష్కరణ జరగడం విశేషమని తెలిపారు.
సోమనాథ్ ఆలయం ముందు ఉన్న విశాల సముద్రం పట్టుదల, శక్తికి చిహ్నమైతే.. విశాఖలోని కైలాసగిరి కూడా అదే విశ్వాసం, భక్తి భావాన్ని ప్రతిబింబిస్తోందని లోకేష్ పేర్కొన్నారు. సోమనాథ్ నుంచి వైజాగ్ వరకు భారత ఆధ్యాత్మిక వారసత్వం ప్రజలకు స్ఫూర్తినిస్తోందని అన్నారు. “ఓం నమఃశివాయ” అంటూ ఆయన చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!