
సినిమాలు

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ‘ది ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్ బిల్, 2026’కు ఆమోదం తెలిపారు. దీంతో జాతీయ గేయం ‘వందేమాతరం’కు జాతీయ గీతం ‘జనగణమన’తో సమానమైన చట్టపరమైన రక్షణ లభించింది. ‘వందేమాతరం’ ఆలాపనను ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం, నిలిపివేయడం లేదా కార్యక్రమానికి అంతరాయం కలిగించడం నేరంగా పరిగణిస్తారు. ఈ నేరాలకు గరిష్ఠంగా మూడేళ్ల జైలు, జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది.
ఈ బిల్లును రాజ్యసభ జూలై 29న, లోక్‌సభ జూలై 30న ఆమోదించాయి. రాష్ట్రపతి ఆమోదంతో ఇది చట్టంగా మారింది. ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో తొలిసారిగా ఎర్రకోట ప్రాకారాల నుంచి ‘వందేమాతరం’ ఆలపించనున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఒకే కార్యక్రమంలో రెండు గీతాలను ఆలపిస్తే ముందుగా ‘వందేమాతరం’, ఆ తర్వాత ‘జనగణమన’ పాడాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!