

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హారర్ కామెడీ ఎంటర్టైనర్ ‘కొరియన్ కనకరాజు’ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్, ‘కంసంనిద’ సాంగ్, టీజర్ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన పొందాయి.
ఇప్పుడు మేకర్స్ ‘రాసగుమ్మడి’ అనే సెకండ్ సింగిల్‌ను జూలై 19న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ పాటలో హీరోయిన్ దక్షా నాగర్కర్ స్పెషల్ డ్యాన్స్ నంబర్‌లో కనిపించనున్నారు. వరుణ్ తేజ్, దక్షా నాగర్కర్‌పై చిత్రీకరించిన ఈ పాట రాయలసీమ జాతర నేపథ్యంలో మాస్ ఫెస్టివ్ సాంగ్‌గా రూపొందింది. థమన్ సంగీతం అందించిన ఈ పాట మరో చార్ట్‌బస్టర్‌గా నిలుస్తుందని అంచనా. ఈ చిత్రం ఆగస్టు 7న విడుదల కానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!