

రుత్విక్, విశాఖ ధిమాన్ జంటగా నటించిన పీరియాడిక్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘రాజా ది రాజా’ విడుదలకు సిద్ధమైంది. అనిల్ బోయిడపు దర్శకత్వంలో, బృందావన్ క్రియేషన్స్ బ్యానర్‌పై కె. నిహారిక దాసరి నిర్మించిన ఈ చిత్రం మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా జూలై 17న భారీ స్థాయిలో విడుదల కానుంది. ఇప్పటికే జరిగిన ప్రీమియర్స్‌కు అద్భుతమైన స్పందన లభించగా, సినిమా పట్ల అంచనాలు పెరిగాయి. ప్రీరిలీజ్ ఈవెంట్‌లో హీరో రుత్విక్ మాట్లాడుతూ, ఈ రోజు కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూశానని, ప్రేక్షకుల ప్రేమ తనకు ఎంతో ప్రత్యేకమని అన్నారు.
ఈ సినిమా ఎంతో ప్యాషన్‌తో తీసినదని, ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని రుత్విక్ నమ్మకం వ్యక్తం చేశారు. దర్శకుడు అనిల్ బోయిడపు క్రియేటివిటీ, మార్క్ కె. రాబిన్ అందించిన సంగీతం, టీమ్ అందరి కృషి సినిమాకు బలం అయ్యాయని తెలిపారు. నిర్మాత నిహారిక దాసరి, హీరోయిన్ విశాఖ ధిమాన్, ఇతర నటీనటులు కూడా సినిమాపై విశ్వాసం వ్యక్తం చేస్తూ, ఇది భావోద్వేగాలతో నిండిన హార్ట్‌ఫుల్ ఎంటర్టైనర్ అని చెప్పారు. ప్రేక్షకులు థియేటర్లలో ఈ చిత్రాన్ని ఆస్వాదిస్తారని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!