
బిజినెస్

అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి. ఇరాన్‌పై భారీ స్థాయి దాడులకు సిద్ధమవుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ దేశ చట్టసభకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు, తాము కూడా పూర్తిస్థాయి యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని ఇరాన్ ప్రకటించింది. ఇటీవల తెల్లవారుజామున అమెరికా బలగాలు ఇరాన్‌లోని కీలక రేవు పట్టణాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్ కూడా ప్రతిదాడులకు దిగింది. అమెరికా స్థావరాలు, మూడు నౌకలపై దాడులు చేసినట్లు సమాచారం. ఈ ఘటనల్లో భారతీయ నౌకా సిబ్బందిలో ఒకరు మృతి చెందగా, పలువురు ప్రభావితమయ్యారు. భారత ప్రభుత్వం ఇరాన్ దౌత్యవేత్తను పిలిపించి తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. వాణిజ్య నౌకల భద్రతకు చర్యలు తీసుకోవాలని కోరింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!