

‘ది ఇండియా స్టోరీ’ చిత్రానికి అనుసంధానంగా రూపొందించిన #వాట్స్ఆన్ యువర్ ప్లేట్ అవగాహన కార్యక్రమాన్ని కాజల్ అగర్వాల్, శ్రేయాస్ తల్పాడే ప్రారంభించారు. ప్రజలు తినే ఆహారం నాణ్యత, పురుగుమందుల వినియోగం, ఆహార భద్రతపై అవగాహన పెంచడం ఈ కార్యక్రమం లక్ష్యంగా ఉంది. కాజల్ తన భోజనం ఫోటోను షేర్ చేస్తూ “మన ప్లేట్‌లోని ఆహారం నిజంగా సురక్షితమేనా?” అనే ప్రశ్నను లేవనెత్తగా, శ్రేయాస్ కూడా ఇదే సందేశాన్ని కొనసాగిస్తూ ప్రజలను ఈ ఉద్యమంలో భాగస్వాములుగా మారాలని కోరారు.
ఈ ఛాలెంజ్‌లో భాగంగా ప్రతి ఒక్కరూ తమ భోజనం ఫోటోను సోషల్ మీడియాలో పంచుకుని మరికొందరిని నామినేట్ చేయాలి. ఈ సందర్భంగా కాజల్ అగర్వాల్, సమంత రూత్ ప్రభు, రకుల్ ప్రీత్ సింగ్‌లను కూడా నామినేట్ చేశారు. ‘ది ఇండియా స్టోరీ’ చిత్రం పురుగుమందుల వ్యవసాయం, ఆహార భద్రత అంశాలపై దృష్టి సారిస్తూ జూలై 24, 2026న విడుదలకు సిద్ధమవుతోంది. సినిమా సందేశాన్ని ప్రజల దైనందిన జీవితానికి తీసుకెళ్లడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!