

యంగ్ హీరో తిరువీర్, ట్యాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న విలేజ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఓ! సుకుమారి’పై అంచనాలు పెరుగుతున్నాయి. నూతన దర్శకుడు భరత్ దర్శన్ దర్శకత్వంలో గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మిస్తున్న ఈ చిత్రం జూలై 17న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు మంచి స్పందన లభించింది. ఈ సందర్భంగా హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ, సినిమాలో తాను పోషించిన ‘దామిని’ పాత్ర ప్రత్యేకమైనదని, కొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తెలిపారు.
దామిని పాత్రలో ప్రత్యేక క్యారెక్టరైజేషన్ ఉంటుందని, “ముట్టుకుంటే షాక్ కొడతాను” అనే వినూత్న అంశం కథలో ఆసక్తిని పెంచుతుందని ఆమె చెప్పారు. ఇది క్యూట్ విలేజ్ స్టోరీగా ఉండి, మంచి వినోదం, భావోద్వేగాలను కలగలిపిన సినిమా అని పేర్కొన్నారు. తిరువీర్‌తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని, దర్శకుడు భరత్ దర్శన్ కథను అద్భుతంగా తెరకెక్కించారని తెలిపారు. విభిన్న పాత్రలు చేయడం తనకు ఇష్టమని, భవిష్యత్తులో మరింత కొత్త పాత్రలతో ప్రేక్షకులను అలరించాలనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!