
రాజకీయాలు

20 ఏళ్ల యువ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద నార్వే చెస్ టోర్నీ టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించాడు. ఈ ప్రతిష్ఠాత్మక టైటిల్‌ను గెలిచిన తొలి భారతీయుడిగా నిలిచాడు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ విజయాన్ని ప్రశంసిస్తూ ఇది అతడి కెరీర్‌లో కీలక మైలురాయిగా అభివర్ణించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ కూడా ప్రజ్ఞానందను అభినందిస్తూ అతని ప్రతిభ, కృషికి ఇది నిదర్శనమన్నారు.
నార్వే చెస్ టోర్నీలో ఇది ప్రజ్ఞానందకు రెండోసారి పాల్గొనడం మాత్రమే. అయినప్పటికీ ప్రపంచ నంబర్ వన్ మాగ్నస్ కార్ల్‌సన్‌ను రెండుసార్లు ఓడించడం విశేషం. తొలి ఆరు రౌండ్లలో మూడు ఓటములు ఎదురైనా, తరువాత వరుసగా నాలుగు విజయాలతో అద్భుతంగా పుంజుకున్నాడు. చివరి రౌండ్‌లో మరో భారత ఆటగాడు గుకేశ్ కార్ల్‌సన్ చేతిలో ఓడిపోయి 8 పాయింట్లతో చివరి స్థానంలో నిలిచాడు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!