
జనరల్

అమెరికా మాజీ కాంగ్రెస్ సభ్యురాలు, రిపబ్లికన్ నేత మర్జోరీ టేలర్ గ్రీన్ సంచలన ఆరోపణలు చేశారు. ఇరాన్‌పై అణ్వాయుధాల వినియోగంపై అమెరికా ఉన్నతస్థాయి వ్యూహాత్మక సమావేశాల్లో చర్చలు జరుగుతున్నాయని ఆమె పేర్కొన్నారు. ట్రంప్ యంత్రాంగం ఇరాన్‌పై తదుపరి సైనిక చర్యలకు సిద్ధమవుతోందని ఆమె వ్యాఖ్యానించారు. అయితే, ఈ వాదనకు సంబంధించి అమెరికా ప్రభుత్వం నుంచి అణుదాడికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఇరాన్‌పై అణ్వాయుధాల వినియోగం జరిగితే ప్రపంచవ్యాప్తంగా తీవ్ర పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని గ్రీన్ హెచ్చరించారు. ఇప్పటికే అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో, మరింత తీవ్ర సైనిక చర్య ప్రపంచాన్ని పెద్ద సంఘర్షణలోకి నెట్టే ప్రమాదం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!