
జనరల్

రాజమండ్రికి చెందిన వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి చెందారు. సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను వైద్యులు మధ్యాహ్నం 3:22 గంటలకు మృతి చెందినట్లు ప్రకటించారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రియాంకకు వైద్యులు చికిత్స అందించారు.
మద్యం మత్తులో ఉన్న నిందితులు కారుతో ప్రియాంకను ఢీకొట్టినట్లు సమాచారం. ప్రమాదం తర్వాత తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిన ఆమె పరిస్థితి విషమంగా మారడంతో చికిత్స కొనసాగించారు. అయితే పరిస్థితి మరింత విషమించడంతో ప్రియాంక మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!