

పోలవరం జిల్లాలో మావోయిస్టులకు సంబంధించిన భారీ ఆయుధాలు, పేలుడు పదార్థాల డంప్‌ను పోలీసులు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్–ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతంలో నిర్వహించిన తనిఖీల్లో ఈ రహస్య డంప్ వెలుగులోకి వచ్చింది. ఇందులో భారీ సంఖ్యలో గ్రెనేడ్ లాంచర్లు, డిటోనేటర్లు, ఇతర పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు గుర్తించి స్వాధీనం చేసుకున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల కార్యకలాపాలను అడ్డుకునే చర్యల్లో ఈ ఘటన కీలక పరిణామంగా భావిస్తున్నారు.
ఈ స్వాధీనానికి సంబంధించిన వివరాలను పోలవరం జిల్లా ఎస్పీ చక్రవర్తి ఎటపాక పోలీస్ స్టేషన్లో వెల్లడించారు. డంప్‌లో లభించిన పేలుడు పదార్థాలు ఎక్కడి నుంచి వచ్చాయి? వాటిని ఎవరు నిల్వ చేశారు? ఏయే కార్యకలాపాలకు వినియోగించాలనుకున్నారు? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టే అవకాశం ఉంది. సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!