
క్రీడలు

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి తన భార్యతో కలిసి తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. నరహరి అలియాస్ సంతోష్‌గా గుర్తింపు పొందిన ఆయన హనుమకొండ జిల్లా కాజీపేట సోమిడి గ్రామానికి చెందినవారు. దాదాపు 45 ఏళ్లుగా అజ్ఞాత జీవితంలో కొనసాగిన ఆయన లొంగుబాటు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
జార్ఖండ్ ఈస్ట్ రీజినల్ బ్యూరో టెక్నికల్ విభాగంలో కీలక బాధ్యతలు నిర్వహించిన నరహరి, మావోయిస్టు కార్యకలాపాల్లో ప్రముఖ నేతగా గుర్తింపు పొందారు. తెలంగాణ పోలీసుల సమక్షంలో భార్యతో కలిసి లొంగిపోవడం భద్రతా వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వం చేపడుతున్న పునరావాస విధానాల ప్రభావంతోనే ఈ లొంగుబాటు జరిగిందని అధికారులు భావిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!