
జనరల్

సంయుక్త మీనన్ ప్రస్తుతం బెంజ్, స్లమ్ డాగ్, స్వయంభూ, బ్లాక్ గోల్డ్ వంటి భారీ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇదే సమయంలో రామ్ పోతినేని కొత్త చిత్రం ‘రాపో-23’లో హీరోయిన్‌గా ఆమె పేరు బలంగా వినిపిస్తోంది. ఈ పాత్ర కోసం మొదట నివేదా పేతురాజ్‌ను పరిశీలించినప్పటికీ డేట్స్ సమస్యల కారణంగా చిత్రబృందం సంయుక్తను సంప్రదించినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
‘రాపో-23’తో రామ్ పోతినేని నటుడిగానే కాకుండా దర్శకుడిగానూ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించనున్నట్లు సమాచారం. సైకాలజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై కృష్ణ పోతినేని నిర్మిస్తుండగా, రామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నారు. అధికారిక ప్రకటన ఇంకా వెలువడకపోయినా, సంయుక్త ఈ ప్రాజెక్ట్‌లో చేరనున్నారనే వార్త అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!