

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన పాలనపై బీఆర్‌ఎస్ పోరుబాటకు సిద్ధమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని ఆరోపిస్తూ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు ఈరోజు ఉదయం తెలంగాణ భవన్‌లో చార్జ్‌షీట్‌ను విడుదల చేయనున్నారు. చార్జ్‌షీట్‌తో పాటు 420 హామీలు, ఆరు గ్యారెంటీల అమలుపై ప్రశ్నిస్తూ ఈ నెల 8వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా వరుస నిరసన కార్యక్రమాలు చేపట్టాలని బీఆర్‌ఎస్ నిర్ణయించింది.
చార్జ్‌షీట్‌తో ప్రారంభమయ్యే ఆందోళనలను ప్రజా ఉద్యమంగా మార్చాలని బీఆర్‌ఎస్ వ్యూహం రూపొందించింది. ఈరోజు నుంచి ధర్నాలు, రైతు సదస్సులు, వంటావార్పులు, యువత ర్యాలీలు, ఆటో ర్యాలీలు, ప్రజావాణి కార్యక్రమాలు నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. మాజీ మంత్రులు, రాష్ట్ర నేతలు ఇప్పటికే సన్నాహక సమావేశాలు నిర్వహించి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!