2, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హైదరాబాద్‌-విజయవాడ హైవేకు భారీ విస్తరణ

Writer: Pooja 05:55 AM, 2 సెప్టెంబర్, 2026
హైదరాబాద్‌-విజయవాడ హైవేకు భారీ విస్తరణ

జాతీయ రహదారి 65 (హైదరాబాద్‌-విజయవాడ హైవే) విస్తరణకు కీలక ముందడుగు పడింది. హైదరాబాద్‌ నుంచి విజయవాడ మీదుగా మచిలీపట్నం వరకు 285 కిలోమీటర్ల మేర రహదారిని రూ.12,073.99 కోట్లతో ఆరు వరుసలుగా విస్తరించేందుకు పబ్లిక్‌-ప్రైవేట్‌-పార్టనర్‌షిప్‌ అప్రైజల్‌ కమిటీ (పీపీపీఏసీ) ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం లభిస్తే నిర్మాణ పనులు ప్రారంభించేందుకు మార్గం సుగమం కానుంది.

ఈ ప్రాజెక్టును మూడు ప్యాకేజీలుగా విభజించారు. హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు తర్వాత ఉన్న ఆందోల్‌ మైసమ్మ ఆలయం నుంచి విజయవాడలోని గొల్లపూడి వరకు 181 కిలోమీటర్ల మేర మొదటి ప్యాకేజీ, హైదరాబాద్‌ నుంచి నందిగామ వరకు 45 కిలోమీటర్ల మేర రెండో ప్యాకేజీ, విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు 59.69 కిలోమీటర్ల మేర మూడో ప్యాకేజీ పనులు చేపట్టనున్నారు.

హైదరాబాద్‌-విజయవాడ మార్గాన్ని బిల్డ్‌-ఆపరేట్‌-టోల్‌ (బీఓటీ) పద్ధతిలో, విజయవాడ-మచిలీపట్నం మార్గాన్ని హైబ్రిడ్‌ యాన్యుటీ మోడ్‌ (హ్యామ్‌) విధానంలో అభివృద్ధి చేయనున్నారు. ప్యాకేజీ-1కు రూ.7,321.97 కోట్లు, ప్యాకేజీ-2కు రూ.2,965.11 కోట్లు, ప్యాకేజీ-3కు రూ.1,786.91 కోట్లు ఖర్చవుతుందని అంచనా. భూసేకరణ, నిర్మాణం, జీఎస్టీ తదితర ఖర్చులతో కలిపి కిలోమీటరుకు సగటున రూ.38 కోట్ల వరకు వ్యయం అయ్యే అవకాశం ఉంది.

ఈ విస్తరణ తెలంగాణలో యాదాద్రి భువనగిరి, నల్గొండ, సూర్యాపేట జిల్లాల మీదుగా, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌టీఆర్‌, కృష్ణా జిల్లాల మీదుగా సాగనుంది. రెండు రాష్ట్రాల్లోనూ అవసరమైన భూమిలో ఎక్కువ భాగం ఇప్పటికే అందుబాటులో ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు.

విస్తరణ అనంతరం ఎన్‌హెచ్‌-65ను హైస్పీడ్‌ కారిడార్‌గా అభివృద్ధి చేయనున్నారు. ఆరు వరుసల ప్రధాన రహదారితో పాటు రెండు వైపులా క్రాష్‌ బారియర్లు, రెండు వరుసల సర్వీస్‌ రోడ్లు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి 15 నుంచి 18 కిలోమీటర్లకు ఒక ఎంట్రీ, ఎగ్జిట్‌ పాయింట్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.

ఈ మార్గంలో ప్రయాణించిన దూరానికి అనుగుణంగా టోల్‌ వసూలు చేసే సాంకేతికతను తీసుకురానున్నారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు తరహాలో వాహనం హైవేలోకి ప్రవేశించే సమయంలో స్కాన్‌ చేసి, బయటకు వెళ్లే ప్రాంతంలో ప్రయాణించిన దూరాన్ని బట్టి టోల్‌ వసూలు చేసే విధానం అమలు చేయాలని ప్రతిపాదించారు. పీపీపీఏసీ ఆమోదంతో ఈ ప్రతిపాదన ఇప్పుడు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదానికి వెళ్లనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలుగు ఐపీఎస్‌లకు దక్కిన ప్రతిష్ఠాత్మక గౌరవం

తెలుగు ఐపీఎస్‌లకు దక్కిన ప్రతిష్ఠాత్మక గౌరవం

నరసింహుడి నాభి నుంచి వచ్చే స్వేదం వెనుక కథేంటి?

నరసింహుడి నాభి నుంచి వచ్చే స్వేదం వెనుక కథేంటి?

శ్రీ  కృష్ణాష్టమి జన్మాష్టమి పూజా సమయాలు ఇవే...

శ్రీ కృష్ణాష్టమి జన్మాష్టమి పూజా సమయాలు ఇవే...

నేటి రాశిఫలాలు: ఎవరికీ కలిసొచ్చే సమయమంటే?

నేటి రాశిఫలాలు: ఎవరికీ కలిసొచ్చే సమయమంటే?

వెయ్యి రోజుల్లో విధ్వంసమే ఎక్కువ: హరీశ్ రావు

వెయ్యి రోజుల్లో విధ్వంసమే ఎక్కువ: హరీశ్ రావు

అన్నా హజారేను పరామర్శించిన మహారాష్ట్ర సీఎం

అన్నా హజారేను పరామర్శించిన మహారాష్ట్ర సీఎం

ట్యాగ్లు
జాతీయ రహదారి 65హైదరాబాద్ విజయవాడ హైవేహైవే విస్తరణఆరు వరుసల రహదారిహైస్పీడ్ కారిడార్టోల్ విధానం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పరాగ్వేలో సత్తా చాటిన హైదరాబాద్‌ రేసర్‌ నవీన్‌ పులిగిల్ల
క్రీడలు

పరాగ్వేలో సత్తా చాటిన హైదరాబాద్‌ రేసర్‌ నవీన్‌ పులిగిల్ల

అంతర్జాతీయ స్కేటింగ్‌లో హైదరాబాద్‌ బాలుడి సత్తా
క్రీడలు

అంతర్జాతీయ స్కేటింగ్‌లో హైదరాబాద్‌ బాలుడి సత్తా

తెలుగు ఐపీఎస్‌లకు దక్కిన ప్రతిష్ఠాత్మక గౌరవం
జనరల్

తెలుగు ఐపీఎస్‌లకు దక్కిన ప్రతిష్ఠాత్మక గౌరవం

హైదరాబాద్‌-విజయవాడ హైవేకు భారీ విస్తరణ
జనరల్

హైదరాబాద్‌-విజయవాడ హైవేకు భారీ విస్తరణ

నరసింహుడి నాభి నుంచి వచ్చే స్వేదం వెనుక కథేంటి?
జనరల్

నరసింహుడి నాభి నుంచి వచ్చే స్వేదం వెనుక కథేంటి?

శ్రీ  కృష్ణాష్టమి జన్మాష్టమి పూజా సమయాలు ఇవే...
జనరల్

శ్రీ కృష్ణాష్టమి జన్మాష్టమి పూజా సమయాలు ఇవే...

నేటి రాశిఫలాలు: ఎవరికీ కలిసొచ్చే సమయమంటే?
జనరల్

నేటి రాశిఫలాలు: ఎవరికీ కలిసొచ్చే సమయమంటే?

‘రంభ ఊర్వశి మేనక’తో అల్లరి నరేష్‌ నవ్వుల సందడి
సినిమాలు

‘రంభ ఊర్వశి మేనక’తో అల్లరి నరేష్‌ నవ్వుల సందడి

వెయ్యి రోజుల్లో విధ్వంసమే ఎక్కువ: హరీశ్ రావు
జనరల్

వెయ్యి రోజుల్లో విధ్వంసమే ఎక్కువ: హరీశ్ రావు

అన్నా హజారేను పరామర్శించిన మహారాష్ట్ర సీఎం
జనరల్

అన్నా హజారేను పరామర్శించిన మహారాష్ట్ర సీఎం

‘పద్మావత్’ జౌహర్ సీన్‌పై స్వరా భాస్కర్ వ్యాఖ్యలు..
సినిమాలు

‘పద్మావత్’ జౌహర్ సీన్‌పై స్వరా భాస్కర్ వ్యాఖ్యలు..

‘ఈ నగరానికి ఏమైంది 2’ షూటింగ్ పూర్తి.. రిలీజ్ డేట్ ఫిక్స్
సినిమాలు

‘ఈ నగరానికి ఏమైంది 2’ షూటింగ్ పూర్తి.. రిలీజ్ డేట్ ఫిక్స్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!