

పోలవరం జిల్లా గొల్లగుప్పలో మలేరియా నివారణకు పంపిణీ చేసిన క్లోరోక్విన్ మాత్రలతో అస్వస్థతకు గురైన ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. గ్రామంలో మొత్తం 71 మందికి మందులు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. అస్వస్థతకు గురైన 29 మందిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా, మరో 24 మందికి లక్ష్మీపురం పీహెచ్‌సీలో వైద్యం అందిస్తున్నారు. ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహించారు.
భద్రాచలం ఆసుపత్రికి వెళ్లిన చింతూరు ఐటీడీఓ పీఓ, ఏఎస్పీ, ఇతర అధికారులు బాధితుల పరిస్థితిని పరిశీలించారు. ప్రస్తుతం బాధితుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఇద్దరు మృతి చెందారనే సమాచారం వాస్తవం కాదని అధికారులు సీఎంకు వివరించారు. కాకినాడ జీజీహెచ్ నుంచి ఇప్పటికే తొమ్మిది మంది సభ్యులతో వైద్య బృందాన్ని పంపగా, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ నుంచి మరో మూడు ప్రత్యేక బృందాలు బయలుదేరినట్లు కలెక్టర్ దినేష్ తెలిపారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు ఘటనపై సమగ్ర విచారణ జరపాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!