

ఈ నెలలో వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) స్థూల వసూళ్లు వార్షిక ప్రాతిపదికన 14.8 శాతం పెరిగి రూ.1,99,853 కోట్లకు చేరాయి. దేశీయ కార్యకలాపాలు, దిగుమతులు పెరగడం వసూళ్ల వృద్ధికి ప్రధాన కారణంగా నిలిచాయి. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన డేటా ప్రకారం, దేశీయ కార్యకలాపాలపై జీఎస్‌టీ ఆదాయం 9.3 శాతం పెరిగి రూ.1.37 లక్షల కోట్లకు చేరగా, దిగుమతులపై పన్ను ఆదాయం 29 శాతం వృద్ధితో రూ.62,604 కోట్లుగా నమోదైంది. మొత్తం వసూళ్లలో సెంట్రల్ జీఎస్‌టీ రూ.38,413 కోట్లు, స్టేట్ జీఎస్‌టీ రూ.46,316 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్‌టీ రూ.1.15 లక్షల కోట్లుగా ఉన్నాయి.
ఈ నెలలో జీఎస్‌టీ రిఫండ్లు 68 శాతం పెరిగి రూ.31,795 కోట్లకు చేరడంతో, నికర జీఎస్‌టీ ఆదాయం రూ.1.68 లక్షల కోట్లుగా నమోదైంది. తెలంగాణలోనూ జీఎస్‌టీ రాబడి గణనీయంగా పెరిగింది. ఐజీఎస్‌టీ సెటిల్‌మెంట్ అనంతరం రాష్ట్ర జీఎస్‌టీ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 17 శాతం వృద్ధితో రూ.4,550 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే నెలలో తెలంగాణ జీఎస్‌టీ రాబడి రూ.3,875 కోట్లుగా ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!